కామారెడ్డి, డిసెంబర్ 1 : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు సోమవారం తొలగించారు. సర్వే నం.6లో కొందరు అక్రమంగా కట్టుకున్న దుకాణాలు, షెడ్లను పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో జేసీబీలతో తొలగించారు.
25 సంవత్సరాలుగా ఈ దుకాణాలపైనే ఆధారపడి బతుకున్నామని, టాక్స్ కడుతున్నామని, ఇప్పుడు వాటిని తొలగించడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నామని, మున్సిపల్ అధికారులు ఇలా తొలగించడం సరికాదని వాపోయారు. అక్రమ నిర్మాణాలను తొలగించామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.