Kalyana Lakshmi | నాగర్‌కర్నూల్, జనవరి 9 : తమకు ఓటు వేయలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును లబ్ధిదారులకు ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోటుచేసుకున్నది. నాగర్‌కర్నూల్‌లోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు.
నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకు చెంది న నలుగురు లబ్ధిదారులకు చెక్కులు మంజూరయ్యాయి. ముగ్గురు బీఆర్ఎస్కు చెందిన వారు కాగా ఒకరు కాం గ్రెస్‌కు చెందిన వారు. దీంతో స్టేజీపైకి కాం గ్రెస్‌కు చెందిన లబ్ధిదారులను పిలిపిం చి, మిగతావారిని విస్మరించారు. సాయంత్రం 3గంటల వరకు పడిగాపులు కాసినా మంజూరైన చెక్కులను ఇవ్వకుండా గ్రామంలో ఇస్తామనడం ఏమిటని మండిపడ్డారు.