గంభీరావుపేట ;రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మల తిరుపతిగౌడ్-శోభ దంపతులకు సోమవారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కల్యాణ లక్ష్మి చెక్కుతోపాటు కేటీఆర్ పుట్టినరోజు కానుకగా జడ్పీటీసీ విజయ సమకూర్చిన చీర, కనుము అందజేశారు. నాలుగు నెలల క్రితం తిరుపతిగౌడ్ తన కూతురు పెండ్లి చేయగా, ఆయన భార్య శోభ పేరిట కల్యాణ లక్ష్మి చెక్కును ప్రభుత్వం మంజూరు చేసింది.