భూత్పూర్, ఆగస్టు 1 : ప్రభుత్వ పథకం సాయం అందించే క్రమంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీ బీకి దొరికారు. మహబూబ్‌నగర్ జిల్లా భూ త్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం సాయానికి విచారణ కోసం ఆర్ఐ బాలసుబ్రమణ్యంను సంప్రదించాడు. దీనికి రూ.8 వేలు లంచం కావాలని ఆయన డిమాండ్ చేశారు. చివరకు రూ.4 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. శుక్రవారం ఆర్ఐకి సదరు వ్యక్తి డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నది. గత నెల రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ చెక్‌పోస్టులు, సబ్‌రిజిస్ట్రా ర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిం చి 22 కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ కేసుల్లో ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి 20 మంది ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసినట్టు వెల్లడించింది. 13 ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్ష లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో రూ.11.5 కోట్లు వెలికితీయడంతోపాటు బ్యాంకులో జమకాని రూ.1.49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.