హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణ జెన్‌జీ కదలండి.. అమరుల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై పోరాటా లు నిర్మించండి.. మూసీ సుందరీకరణ పేరి ట కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న రూ.1.50 లక్షల కోట్ల దోపిడీని అడ్డుకోండి.. తెలంగా ణ భూములు, వనరులను కొల్లగొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిని గద్దెదించండి’ అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం యువ నేత వర్షిత్ ఆధ్వర్యంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో నియోజకవర్గ యువకులు భారీసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రవీణ్‌కుమా ర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘జెన్‌జీ యువత మాత్రమే కాదు.. అదొక విస్ఫోటక శక్తి.. దోపిడీ నుంచి రేపటి తెలంగాణను కాపాడుకొనే శక్తి’ అని అభివర్ణించారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా జెఎన్జీ ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
పొంగులేటి భూదోపిడీని అడ్డుకోండి
నాదర్గుల్లో మంత్రి పొంగులేటి కుటుంబం రూ.7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల భారీ భూదోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరులను, ఖమ్మం వెలుగుమట్లలో బుల్డోజర్లకు అడ్డుగా నిలిచిన సలోమి అనే యువతిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఉద్బోధించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు!
పేద విద్యార్థుల ఉన్నత చదువులు లక్ష్యం గా వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్మెం ట్ పథకానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రె స్ ప్రభుత్వం యత్నిస్తున్నదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
మీ మనుమడిలాగా మా పిల్లలుప్రైవేట్ ఫీజులు చెల్లించలేరు!
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను ని యంత్రించాలని ఓవైపు విద్యా కమిషన్ ని వేదిస్తే.. సీఎం మాత్రం ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్‌రెడ్డికి చెందిన లేక్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెనింగ్‌కు వెళ్లి రిబ్బన్ కట్‌చేయడం సిగ్గుచేటని ఆర్ఎస్పీ విమర్శించా రు. ‘ఆ స్కూల్లో ఫీజులు ఏటా ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల వరకు ఉంటుందని, ఆ ఫీజు మీ మనుమడిలాంటి వారు కడుతారని, మాలాంటి పేదలకు అంత ఫీజు చెల్లించే శక్తి ఉన్నదా?’అని నిలదీశారు.
గురుకులాల రద్దుకు కుట్రలు
విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గురుకులాలను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేయాలని సిఫార్సు చేయడం శోచనీయమని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల ఉ ద్యోగాల భర్తీ పేరిట నిరుద్యోగ యువతకు ధోకా చేసిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఉద్యమకారులైన విద్యార్థి నేతలను గుర్తించి కేసీఆర్ తన పాలనలో సముచిత ప్రాధా న్యం ఇచ్చారని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు గుర్తుచేశారు.
కాంగ్రెస్ అరాచకాలను తిప్పికొట్టాలి: జైపాల్‌యాదవ్
రెండున్నరేండ్ల తన పాలనలో కాంగ్రెస్ సర్కార్ అన్నివర్గాలను మోసం చేసిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్పోర్ట్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, బీఆర్ఎస్వీ సీనియర్ నేత గోపగాని రఘురాం పాల్గొన్నారు.