BRS | ముంబై, 28 జూలై (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. పార్టీ నిర్మాణంతోపాటు ప్రజల మనోగతాన్ని తెలుసుకోవటం, నియోజకవర్గాలవారీగా సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణను రూపొందించటం వంటి కీలక అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన 15 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. స్టీరింగ్ కమిటీతోపాటు ఇప్పటికే ప్రకటించిన ఆరు డివిజన్ కమిటీ సమన్వయకర్తలకు, సహాయకులుగా ఉండేందుకు సహాయ సమన్వయకర్తలను నియమించినట్టు తివారీ తెలిపారు.
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, రెండు మూడురోజుల్లో 36 జిల్లాలకు పార్టీ సమన్వయకర్తలను, సహాయ సమన్వయకర్తలను నియమించే అవకాశాలున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ చైర్మన్‌గా ఉన్న స్టీరింగ్ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు భానుదాస్ ముర్ఖుటే, శంకరన్న దోండ్గే, అన్నా సాహెబ్ మానే,గా ఉన్న స్టీరింగ్ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు భానుదాస్ ముర్ఖుటే, శంకరన్న దోండ్గే, అన్నా సాహెబ్ మానే, దీపక్ ఆత్రం, మాజీ ఎంపీ హరిభావు రాథోడ్, ఘనశ్యామ్ రాథోడ్, మాణిక్ కదం (బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు), కల్వకుంట్ల వంశీధర్‌రావు, ద్యానేశ్ వాకుడ్కర్, సచిన్ సాఠే, సురేఖ పుణేకర్, ఖదీర్ మౌలానా, యశ్పాల్ బింగే, ఫిరోజ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. స్టీరింగ్ కమిటీకి కల్వకుంట్ల వంశీధర్‌రావు ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జిగా సీఎం కేసీఆర్ తనను నియమించటంపై వంశీధర్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను శుక్రవారం ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

24