Kalvakuntla Himanshu Rao | యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు కల్వకుంట్ల హిమాన్షు మంగళవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్నారు. హిమాన్షు తన స్నేహితులతో కలిసి యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. దర్శనం అనంతరం కల్వకుంట్ల హిమాన్షుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కల్వకుంట్ల హిమాన్షు వెంట మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆలయ వీధుల్లో హిమాన్షు కలియ తిరిగారు. ఆలయ ప్రాముఖ్యత గురించి తన స్నేహితులకు హిమాన్షు వివరించారు.