వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 25: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ట్రే వెకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యిందని, కన్వీనర్ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని యూనివర్సిటీ తెలిపింది.
అర్హులైన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటా బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతూ యూనివర్సిటీ సోమవారం ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు మంగళవారం ఉదయం 8 నుంచి అక్టోబర్ 2వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది.