Pargi | మీ కాళ్లు మొక్కుతాం పర్మిషన్ ఇవ్వండి.. పరిగి పోలీసులను వేడుకున్న మహిళా రైతులు
Pargi | వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు చేస్తున్న ధర్నాకు పర్మిషన్ నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది.
Pargi | వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు చేస్తున్న ధర్నాకు పర్మిషన్ నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది.
ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని చేస్తున్న రిలే దీక్షలకు అనుమతి ఇవ్వాలని వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామ రైతులు పరిగి పోలీస్ స్టేషన్ను మెట్లు ఎక్కారు. కానీ ఈ దీక్షలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వస్తుండటంతో అనుమతి నిరాకరించారు. దీంతో పోలీస్ స్టేషన్ బయటే పలువురు రైతులు బైఠాయించారు. ఈ క్రమంలో మీ కాళ్లు మొక్కుతాం.. పర్మిషన్ ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ల మీద పడి మహిళా రైతులు వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు అనుమతిని నిరాకరిండంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ కాళ్ళు మొక్కుతం పర్మిషన్ ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ళు మొక్కిన మహిళా రైతులు
అయినా అనుమతి నిరాకరించిన పోలీసులు
పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల రైతుల భూమిని గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న రిలే దీక్ష వద్దకు వస్తున్న హరీష్… https://t.co/oWz7FwBAUt pic.twitter.com/2kqv16hmPP
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
శాంతియుతంగా నిరసన తెలిపితే పర్మిషన్ ఎందుకు ఇవ్వరంటూ పోలీసులను రైతులు నిలదీశారు. పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు రైతులను లోపలే ఉంచి పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేశారు. దీంతో స్టేషన్ బయట ఉన్న రైతులు గేటు ఎక్కి మరీ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరిగి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్
మద్దతుగా హరీష్ రావు వస్తున్నాడని అనుమతి ఇవ్వకుండా రైతులను పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీసులు
పోలీస్ స్టేషన్ ముందు కాళ్లాపూర్ రైతులు, గ్రామస్తుల ఆందోళన
రేవంత్ రెడ్డి భూ దాహానికి తమ 1200 ఎకరాలు పోతున్నాయని రైతులు చేస్తున్న రైతుల రిలే నిరవదిక దీక్షకు… pic.twitter.com/iPUtTKr0uF
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

