హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : రైతులకు సాగునీరు అందించేందుకు తమ రక్తమిచ్చేందుకైనా సిద్ధమని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో సాగునీటి లభ్యత, రైతాంగ సమస్యలు, కాంగ్రెస్ సుదీర్ఘ రాజకీయ చరిత్రలోని అణచివేత ధోరణిని ఎండగడుతూ కాళేశ్వరం నీటి విడుదల, రైతు సమస్యలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా అదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నీళ్లు అడిగితే కన్నీళ్లు ఇస్తరా? రక్తదాహపు రకసీ’ అంటూ రేవంత్‌రెడ్డిని ఎత్తిపొడిచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హకులు, నీటి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో పాలకుల నుంచి ఇలాంటి అనాగరిక స్పందన రావడం శోచనీయమని వాపోయారు. కరువు తీర్చడానికి, రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడానికి తమ రక్తమే అడ్డమైతే, ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ ఎండిపోతున్న రైతుల పొలాలకు తక్షణమే నీరదించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఎముకలు విరిగేలా పోరాడామని, రైతుల కోసం ఎంత రక్తమైనా చిం దించేందుకు వెనుకాడబోమని పేరొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ సైన్యంగా తెలంగాణ సుభిక్షానికి తాము అన్ని పోరాటాలు, త్యాగాలకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.
నీళ్లు అడిగితే కన్నీళ్లు ఇస్తరా? రక్తదాహపు రకసీ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో హకుల కోసం, నీటి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో పాలకుల నుంచి ఇలాంటి అనాగరిక స్పందన రావడం శోచనీయం. కరువు తీర్చడానికి, రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడానికి మా రక్తమే అడ్డమైతే.. ఎంత రక్తమైనా ధారపోయడానికి మేం సిద్ధం.. కానీ ఎండిపోతున్న రైతుల పొలాలకు తక్షణమే నీళ్లివ్వండి.
-కేటీఆర్
రైతులు సాగునీటి కోసం అలమటిస్తుంటే.. ఉద్దీపన చర్యలు చేపట్టాల్సింది పోయి రక్తం ప్రస్తావన తీసుకురావడం పాలకుల క్రూరత్వానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. దశాబ్దాలుగా తెలంగాణ సమాజాన్ని, ఇకడి వనరులను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దోచుకున్నదో చారిత్రక ఆధారాలతో వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో, అంతకుముందు జరిగిన పలు ఉదంతాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధికార దాహానికి బలైన తెలంగాణ బిడ్డల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ‘60 ఏండ్లుగా తెలంగాణను వేధించి, ఇకడి ప్రజల రక్తాన్ని కాంగ్రెస్ తాగేసింది. కాంగ్రెస్‌కు ఇంకా ఎంత రక్తం కావాలి?’ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ చరిత్రలో జరిగిన వివిధ ఘటనలను ప్రస్తావించారు.1952 ఉద్యమంలో ఏడుగురు యువకులను కాల్చి చంపి, వారి రక్తంతో కండ్లు తుడుచుకున్నారని ధ్వజమెత్తారు.1969 ఉద్యమంలో 369 మంది అమాయక పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిపించి, రక్తం ఏరులై పారించారని గుర్తుచేశారు. మలిదశ, చివరిదశ తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మంది యువకుల ప్రాణాలను బలితీసుకున్న క్రూర చరిత్ర కాంగ్రెస్‌ది అని విమర్శించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కాలయాపన విధానాలే కారణమని మండిపడ్డారు. గతంలో ఎన్కౌంటర్ల పేరుతో సాగించిన నిర్బంధాలు, హకుల హననాన్ని ఖండించారు.
జలసాధన కోసం ఎలాంటి పోరాటాలకైనా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయ ని కేటీఆర్ స్పష్టంచేశారు.‘రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సంక్షేమం కోసం పేగులు తెగేదాకా కొట్లాడిన చరిత్ర మాది. రైతుల పొలాలకు నీరివ్వడం కోసం ఎంతటి త్యా గానికైనా మేము వెనుకాడం’ అని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన పం తాన్ని వీడి ఎండిపోతున్న పొలాలకు సాగునీరందించి రైతులను ఆదుకోవాలని డి మాండ్ చేశారు. కాళేశ్వరం పంప్‌హౌస్ ద్వా రా గోదావరి నీటిని ఎత్తిపోయకుండా ఏపీ కి వదిలిపెడుతూ మన రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులు పకనబెట్టి ఎండిపోతున్న పొలాల దాహాన్ని తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.