హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ) : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విజిలెన్స్ విచారణ, ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సమర్పించిన నివేదికలను అందివ్వాలని ప్రభుత్వాన్ని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు సర్కారుకు తాజాగా లేఖ రాసింది. ఈ అంశంపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ను నియమించిన ఈ నేపథ్యంలో నివేదికలను అందివ్వాలని ప్రభుత్వానికి కమిషన్ ఆదేశించింది. వాటన్నింటినీ పరిశీలించి, నివేదికను సిద్ధం చేసేందుకు కమిషన్ సిద్ధమవుతున్నది.