హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్షం గొంతునొక్కేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలకు తెరలేపిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 665 పేజీలున్న రిపోర్ట్‌ను చదివేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా కుయుక్తులు పన్నిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రతిపక్ష నేత అసెంబ్లీకి హాజరుకాలేదనే సాకుతో కమిషన్ నివేదికకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ను అందించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ సభ్యులకు కనీస సమయం ఇవ్వకుండా చర్చకు కొన్ని గంటల ముందు పెన్‌డ్రైవ్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.