హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగా ణ): కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ విచార ణ పేరిట నోటీసులు జా రీ చేయడం కాంగ్రెస్ ప్ర భుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు ప రాకాష్ట అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కాళేళ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్‌కు వచ్చిన పేరు ప్రతిష్ఠలను చూసి ఓర్వలేకనే ప్రభుత్వం విషం కక్కుతున్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ జిత్తుల మారి రాజకీయం చూసి, గోబెల్స్ కూ డా సిగ్గుపడుతాడని ఎద్దేవా చేశారు. ‘అసలు ఏం నే రం చేశారని కేసీఆర్‌ను వేధిస్తున్నారు? ప్రాణాలు ప ణంగా పెట్టి తెలంగాణను సాధించినందుకా? కాళేళ్వరం ప్రాజెక్టును కట్టి.. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చినందుకా? రైతుబంధు, రైతుబీమా, ఉచిత వి ద్యుత్తుతో రైతును రాజును చేసినందుకా? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లిచ్చినందుకా?’ అంటూ జీవన్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.