హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): వరంగల్ ‘కలంకారి దరీస్’కు అరుదైన అవకాశం దక్కింది. రష్యాలో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో చోటు సంపాదించుకుంది. ‘ఒక రాష్ట్రం ఒక ఉత్పత్తి విధానాన్ని’ ప్రపంచమంతా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా రష్యాలో భారత రాయబార కార్యాలయం, ఓరియంటల్ స్టడీస్, రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా 10 రాష్ర్టాలకు చెందిన 21 రకాల భారత చేతివృత్తి ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాయి.
అందులో తెలంగాణ నుంచి వరంగల్ జిల్లాలోని కలంకారి దరీస్ను ఎగ్జిబిషన్లో ప్రదర్శించినట్టు రష్యాలో భారత రాయబారి వినయ్‌కుమార్ వెల్లడించారు.