Kakatiya University | జర్మనీలోని మూడు విశ్వవిద్యాలయాలతో కాకతీయ వర్సిటీ అవగాహన ఒప్పందాలు
Kakatiya University | ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించే లక్ష్యంతో కాకతీయ విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసిందని ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు.
హనుమకొండ చౌరస్తా : ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించే లక్ష్యంతో కాకతీయ విశ్వవిద్యాలయం ( KU) కీలక ముందడుగు వేసిందని ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి ( Professor K. Pratap Reddy, ) అన్నారు. జర్మనీ పర్యటన సందర్భంగా అక్కడి ప్రముఖ మూడు విశ్వవిద్యాలయాలతో ఆయన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ మేరకు 2026 జూన్ 1న ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాధిపతులకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను సమర్పించారు. ఈ సందర్భంగా విదేశీ సంబంధాల డైరెక్టర్ కై హిల్లెబ్రెఖ్ట్, అంతర్జాతీయ సంబంధాల విభాగాధిపతి, డిప్యూటీ డైరెక్టర్ టాంజా ఫాల్కోవ్ స్కీలతో చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, రూసా 2.0 రాష్ట్ర ప్రాజెక్టు అధికారి డాక్టర్ సౌందర్య జోసెఫ్ చర్చల్లో పాల్గొన్నారు.
ప్రతిపాదిత అవగాహన ఒప్పందాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, సంయుక్త పరిశోధన అవకాశాలు, విద్యార్థి-అధ్యాపకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు, సమ్మర్, వింటర్ స్కూల్స్‌లో పాల్గొనే అవకాశాలు, అధ్యాపకుల అకాడమిక్ సహకారం వంటి అనేక అంతర్జాతీయ అవకాశాలు లభించనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

