వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 17: కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దాడి చేసిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. 2022 బ్యాచ్ విద్యార్థి మనోహర్ సోలంకి ఈ నెల 14న రాత్రి హాస్టల్ వెళ్తుండగా, 13 మంది సీనియర్లు తమ మిత్రు డి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలంటూ బలవంతంగా మద్యం తాగించి, డాన్సులు చేయించారు. అర్ధరాత్రి దాటినా వేధింపులు ఆగకపోవడంతో మనోహర్ తిరగబడగా, సీనియర్లు దాడి చేశారు. ఎంజీఎంలో చికిత్స పొంది శనివారం డిశ్చార్జి అయిన మనోహర్ పోలీసులకు, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.