స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 3: పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని.. ఆ విషయంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆదివారం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
మాజీ సర్పంచులు తమ హయాంలో గ్రామాల్లో సొంత ఖర్చులతో చేసిన అభివృద్ధి బిల్లులు రాలేదని, ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై పడుతుందని ఓ కాంగ్రెస్ కార్యకర్త కడియం దృష్టికి తీసుకెళ్లాడు. బిల్లుల వివరాలను పార్టీ కార్యాలయంలో అందిస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల లోపు బిల్లులు వచ్చేలా కృషి చేస్తానని కడియం బదులిచ్చారు.