స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 22 : పార్టీ ఫిరాయింపుపై వివరణ ఇవ్వాలంటూ శాసనసభ స్పీకర్ నుంచి తనకు నోటీసు లు అందాయని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో పలు అభివృద్ధి పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆయన శం కుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23లోపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ సభాపతి నుంచి తనకు నోటీసులు అందినట్టు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు స మయం కోరగా స్పీకర్ సానుకూలం గా స్పందించారని వెల్లడించారు. నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే తిరిగి పోటీ చేస్తానని వివరించారు.