Kadiyam Srihari | ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం తమపై ఉంది: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళమెత్తిందని చెప్పారు. తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్లగొండ’ బహిరంగ సభకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నల్లగొం జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందని చెప్పారు. అసెంబ్లీలో అబద్ధాలను ప్రచారం చేసిందని విమర్శించారు. కృష్ణా నదికింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడం మంచిది కాదని, దానివల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి సర్కార్‌కు కనిపించడం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియ చెప్పాల్సిన అవసరం తమపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నది జలాల పైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపై సభలో వివరిస్తారని వెల్లడించారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో దీనిని మరింత ఉధృతం చేస్తామన్నారు.
తెలంగాణ భవన్ నుంచి “ఛలో నల్గొండ” బహిరంగ సభకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు
ఈరోజు పార్టీ ప్రజా ప్రతినిధులను సీనియర్ నాయకులను అంత నల్గొండ బహిరంగ సభకు బయలుదేరి వెళుతున్నాము
తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది… pic.twitter.com/TRdE4Qhjh7
— BRS Party (@BRSparty) February 13, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

