స్టేషన్ ఘన్పూర్, జనవరి 25: ‘మళ్లీ, మళ్లీ చెబుతున్న, నేను బీఆర్ఎస్ టికెట్‌పైనే గెలిచాను.. వచ్చే నెలలో జరుగనున్న స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను ఓట్లు అడుగుతా’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
ఆదివారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మరో మూడేండ్లు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ అండదండలతో మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఓటు అడుగుతానని తెలిపారు. గెలిచింది బీఆర్ఎస్ టికెట్‌పైనే అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని స్పష్టంచేశారు.