KCR | కడియం భూ స్థాపితమే.. ఆయనో పొద్దుతిరుగుడు పువ్వు : కేసీఆర్
KCR | కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తును తానే భూస్థాపితం చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు.
- వరంగల్‌లో లాభమే జరిగింది
- టీవీ 9 ఇంటర్వ్యూలో కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తును తానే భూస్థాపితం చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఓడిపోయి ఇంటికాడ ఉన్న శ్రీహరికి ఉపముఖ్యమంత్రిని చేశానని గుర్తుచేశారు.
ప్రశ్న: టికెట్ ఇచ్చిన కడియంశ్రీహరి ఎందుకు బయటకు వెళ్లారు? మీరు డబ్బులు ఇచ్చారా? లేదా?
జవాబు: కడియం శ్రీహరికి డబ్బు లు ఇచ్చారా? లేదా? అనేది ఏ రాజకీయ పార్టీ చెప్పదు. ఇది పొలికటికల్ వ్యవహారం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. శ్రీహరి అనే వ్యక్తి ఓడిపోయి ఇంటికాడ ఉంటే.. నేనే పిలిచి ఆయనను ఎంపీగా గెలిపించిన. ఆయనతో ఇక్క డ అవసరం ఏర్పడిందని, ఆయన సీనియర్ అని, రాజీనామా చేయించి, మళ్లీ బై ఎలక్షన్లలో గెలిపించి, ఎమ్మెల్సీని చేసిన. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని చేశాను. ఒక రాజకీయ పార్టీ అంతకంటే ఎక్కువ ఏ పదవి ఇస్తదండి.
ఆయ ఖర్మ బాగా లేక వెళ్లిపోయిండు. రాజకీయంగా తనను తానే భూ స్థాపితం చేసుకున్నడు. వరంగల్‌లో తాను చచ్చి, ఇప్పుడు బీఆర్ఎస్ను బతికిచ్చిండు. మాకు లాభం జరిగింది. మీరు చూస్తరు వరంగల్ రిజల్ట్. నీ బిడ్డకు టికెట్ ఎట్లా వచ్చిందండి? ఆ అమ్మాయికి ఎం దుకు ఇచ్చిన? కడియం కూతురు అనే కదా? అప్పుడు నీకు స్వేచ్ఛ కనపడలే. పొద్దుతిరుగుడు పువ్వు లాగా పార్టీని విడిచి పెట్టి అధికారి పార్టీ వైపు వెళ్లారు.
ప్రశ్న: కడియంతోపాటు చాలామంది కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎట్లా చూస్తరు?
జవాబు: బీఆర్ఎస్ నుంచి వెళ్లనవారు ఎంత మందండి. పిడికెడు మంది. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం. వందల మంది ఎమ్మెల్యేలను, పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలను, పదుల సంఖ్యలో ఎంపీలను, డజన్ల కొద్ది జడ్పీ చైర్మన్లను, డీసీసీబీ చైర్మన్లను, వేల సంఖ్యలో సర్పంచ్‌లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సింగిల్ విండో చైర్మన్లను సృష్టించిన ఒక మహాసముద్రం బీఆర్ఎస్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

