హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : కొండా సురేఖను మంత్రివ ర్గం నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. 72 గంట ల్లో ఆమె రాజీనామా చేయకపోతే, తానే ఆమెపై కేసు వేస్తానని తెలిపారు.
సమంత, నాగార్జున ఇంటికి వెళ్లి మం త్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని సూచించారు. గురువారం ఆయన మీ డియాతో మాట్లాడుతూ.. కొండా సురే ఖ మాటలు చట్టవిరుద్ధమని, హత్యచేసి సారీ చెప్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రహస్యంగా అదానీని ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన వద్దు.. మళ్లీ కేసీఆరే కావాలని కోరుకుంటున్నట్టు కేఏ పాల్ పేర్కొన్నారు. హైడ్రాపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయించారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.