హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కే మల్లికార్జున్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కే శారద, ఆర్థిక కార్యదర్శిగా సీహెచ్ శౌరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పీ పార్థసారధి, సీహెచ్ ప్రభాకర్, చీఫ్ ప్యాట్రన్లుగా కేఎస్ ప్రకాశ్‌రావు, జీవీ బద్రినారాయణరావులను ఎన్నుకున్నారు.