హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది రాష్ర్టాలలో 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉపఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని అధిష్ఠానం ప్రకటించింది. పార్టీ ముఖ్యనేతలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న సింఘ్వీ రిటర్నింగ్ అధికారికి నాలుగు సెట్ల నామినేషన్ను సమర్పించారు. ఆయనవెంట సీఎం రేవంత్రెడ్డి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.