హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ 17న హైదరాబాద్కు రానున్నారు. ప్రాజెక్టు పై విచారణను తిరిగి కొనసాగించనున్నారు.
ఫిబ్రవరితో కమిషన్ ఏర్పడి ఏడాది పూర్తికానున్న ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని జస్టిస్ ఘోష్ భావిస్తున్నట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.