గద్వాల/అయిజ, ఆగస్టు 9 : కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నా యి. శనివారం జూరాల ప్రాజెక్టుకు 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. 8 గేట్లను ఎత్తిన అధికారులు 57,136 క్యూసెక్కులు విడుదల చేశారు. విద్యుదుత్పత్తికి 33,419 క్యూసెక్కులు విడుదల చేయగా ఎత్తిపోతలకు నీటి విడుదల కొనసాగుతున్నది. అవుట్‌ఫ్లో 91,616 క్యూసెక్కులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. 9.193 టీఎంసీలు నిల్వ ఉంది. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 38,818 క్యూసెక్కులు వస్తుండగా.. 6 గేట్లు తెరిచి దిగువకు 65,200 క్యూసెక్కులు వదులుతున్నారు.