హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘మంత్రిగా నా శాఖలో నాకే ఒక్క పని కూడా కా వడం లేదు. అసలు మంత్రిగా ఇచ్చే ఆదేశాలను ముఖ్యకార్యదర్శిగా ఉన్న రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదు, అలాంటప్పుడు మంత్రి పదవిలో ఉం డి ఎందుకు’ అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) వాపోయినట్టు తెలిసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముర్తాజా రిజ్వీ రాజీనామా అంశంలో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ విషయంలో వేళ్లన్నీ ఆయనవైపే చూపిస్తుండటంతో తన వాదనను స మర్థించుకునేందుకు గురువారం పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించాలని భావించారు. ఈ మేరకు మీడియాకు సమాచారం కూడా అందింది. అయితే, అనూహ్యంగా ప్రెస్‌మీట్‌ను రద్దుచేసుకున్న మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి రిజ్వీతో వివాదం, సీఎస్‌కు రాసిన లేఖ బయటకు రావడం వంటి విషయాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు.
రిజ్వీని సర్వీస్ నుంచి రిలీవ్ చేయవద్దని తాను లేఖ రాస్తే, తనతో చర్చించకుండానే, తన అనుమతి తీసుకోకుండానే రిజ్వీకి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతివ్వడం దేనికి నిదర్శమని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. స్పందించిన భట్టివిక్రమార్క మాట్లాడుతూ సీఎస్‌కు రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందని జూపల్లిని ప్రశ్నించినట్టు సమాచారం. ఆ లేఖ బయటకు రావడంతోనే సమస్య మొదలైందని, రిజ్వీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైపు వేలు చూపించేలా ఉన్నదని భట్టి అన్నట్టు తెలిసింది.
ప్రైవేటు సంస్థలో రూ. 10 లక్షల వేతనంతో ఉద్యోగం ఆఫర్ రావడంతోనే రిజ్వీ తన పదవికి వీఆర్ఎస్ ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటులో ఉద్యోగం కోసం ఎవరైనా ఐఏఎస్ ఉ ద్యోగాన్ని వదులుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు ఇంకా 8 ఏండ్ల సర్వీసు ఉం దని, భవిష్యత్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వంలో అవినీతినికి అడ్డు పడినందుకే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.