Jr Doctors | పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. కండ్లకు గంతలు కట్టుకొని నినదించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్దిష్టమైన తేదీకి స్టయిఫండ్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం మూసివేసి నాలుగేల్లు అయ్యిందని.. పక్కనే ఉన్న మరో భవనంలోకి ఆసుపత్రి మార్చారన్నారు. రద్దీ కారణంగా ఇన్ఫెక్షన్ల శాతం పెరుగుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు కండ్లకు గంతలు కట్టుకొని మధ్యాహ్న భోజన విరామ సమయంలో బోధనా ఆసుపత్రుల్లో నిరసన తెలిపారు. నల్లబాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు.