వేములవాడ, మే 19 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. రెండోసారి కూడా సాధారణ కాన్పు కాగా, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యురాలు సంధ్యారాణి తెలిపారు.
మొదటి కాన్పు కూడా ప్రభుత్వ దవాఖానలోనే కాగా, రెండో ప్రసవం అక్కడే అయింది. వంద పడకల ఇక్కడి దవాఖానలో వైద్యసేవలు చాలా బాగున్నాయని జడ్జి జ్యోతిర్మయి తెలిపారు.