హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.2కోట్ల జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ఈ నెల 25న ప్రారంభించనున్నది. గురువారం రవీంద్రభారతిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నది.
ఈ బీమా పథకం అమలు కోసం ప్రభుత్వం వివిధ బ్యాంకర్లతో ఎంవోయూ కుదుర్చుకోనున్నది. ఈ పథకానికి ఎలాంటి ప్రీమియం ఉండదు. ప్రభుత్వం, ఉద్యోగులెవరూ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు సహజంగా, ప్రమాదశాత్తు మరణిస్తే రూ. 1.2కోట్ల పరిహారం అందజేస్తారని ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపారు.