Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లు ఎన్నికల అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ ధృవీకరణ పత్రం అందజేశారు. మొత్తం పోలైన ఓట్లలో నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు(50.83 శాతం), బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు(38.13 శాతం), బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు(8.76 శాతం) పోలయ్యాయి. 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందారు.
2014, 2018, 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ టికెట్‌పై గోపీనాథ్ గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరపున ఆయన భార్య మాగంటి సునీతకు పార్టీ అవకాశం ఇచ్చింది.