శ్రీలంక క్రికెట్ టోర్నీకి భరత్‌రెడ్డి.. అభినందించిన ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని హుజూర్నగర్ యువకుడు బొబ్బ భరత్‌రెడ్డి చేతల్లో చూపెట్టాడు. సూర్యాపేట జిల్లా నుంచి క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
హుజూర్నగర్, మార్చి 15: సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని హుజూర్నగర్ యువకుడు బొబ్బ భరత్‌రెడ్డి చేతల్లో చూపెట్టాడు. సూర్యాపేట జిల్లా నుంచి క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం నల్లగొండ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న భరత్‌రెడ్డి ఈనెల 15వ తేదీ నుంచి శ్రీలంకలో మొదలయ్యే అంతర్జాతీయ స్థాయి టీ20, వన్డే టోర్నీలకు ఎంపికయ్యాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులైన భరత్‌రెడ్డి తల్లిదండ్రులు భాస్కర్‌రెడ్డి, నిర్మల క్రికెట్లో అతన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన భరత్ గత ఏడేండ్లుగా బుచ్చిబాబు, ఇంద్రశేఖర్‌రెడ్డి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇప్పటి వరకు వివిధ టోర్నీలు ఆడిన భరత్ 100కు పైగా వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ బౌలర్ సిరాజ్‌ను ఆదర్శంగా తీసుకునే భరత్ భవిష్యత్‌లో జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్లో ఆడటమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తున్నాడు. శ్రీలంకలో జరిగే టోర్నీ కోసం వెళుతున్న భరత్‌రెడ్డిని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్లో అద్భుత ప్రతిభతో తెలంగాణతో పాటు దేశానికి మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

