మంథని: బీఆర్ఎస్ పార్టీ నేత, మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధూకర్ సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం కన్నాల గ్రామ పంచాయతీ బోడగుట్టపల్లెకు చెందిన వార్డు మెంబర్, బీజేపీ నేత, గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర సది గౌడ్తోపాటు పలువురు గౌడ సంఘం సభ్యులను పుట్ట మధు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సింగిల్ విండో చైర్మెన్ కెశోరాం, పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పుప్పాల దయానందం ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర సది గౌడ్, సభ్యులు బుర్ర రాజు గౌడ్, బుర్ర కుమార్ గౌడ్, బుర్ర కొమురయ్య గౌడ్, నాగుల చంద్రయ్య గౌడ్, నాగుల అంజయ్య గౌడ్, బాలగాని యాకయ్య గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, నాగుల సంజీవ్ గౌడ్, బుర్ర బాపు గౌడ్, బుర్ర సదానందం గౌడ్, పురేళ్ల ఎల్లయ్య గౌడ్, పురేళ్ల వెంకీ గౌడ్, నల్గొని వీరయ్య గౌడ్, పడాల సంపత్ గౌడ్, సూదగోని క్రాంతి గౌడ్, సూదగోని శివ గౌడ్, పురేళ్ల కుమార్ గౌడ్, సూదగోని రవి వర్మ గౌడ్ లకు పుట్ట మధు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్, ఎంపీటీసీలు అతిక్, సృజన సదానందం, సింగిల్ విండో వైస్ చైర్మన్ కుడికాల సురేష్,ఉప సర్పంచ్ పుట్ట రంజిత్, కాదాసి శారదా తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఖాదర్ పాషా, నాయకులు ఖాలీక్ సెట్, డిష్ ఖదీర్, బూడిద కుమార్, తగురం సతీష్, కరీం, మాటూరి శశి, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.