జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణానికి చెందిన జిల్లా చిందు హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గడ్డం మధు, బ్యాండ్ యూనియన్ అధ్యక్షుడు గడ్డం శంకర్, పట్టణ 12వ వార్డుకు చెందిన 30 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసే పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు పంబాల రామ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ ఫోరం ఉపాధ్యక్షులు బోడ్ల జగదీష్, ఉప్పారి రెడ్డి, పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేక పవన్ తదితరులు పాల్గొన్నారు.