UN Report | ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడులో జైషే మహ్మద్ హస్తం : ఐక్యరాజ్యసమితి నివేదిక
UN Report | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్నదని పేర్కొన్నది.
UN Report : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్నదని పేర్కొన్నది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే మహ్మద్ తదితర ఉగ్ర ముఠాలు దక్షిణాసియాలో క్రియాశీలంగా నేర కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపింది.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి సమర్పించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ‘ఆంక్షలు ఉన్నప్పటికీ జైషే ముఠా పలు ఉగ్రదాడులకు పాల్పడినట్లు తెలుస్తున్నది. 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి అందులో ఒకటని ఒక సభ్యదేశం ఆరోపించింది. అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే కొత్త పన్నాగాలు పన్నుతోంది. గత ఏడాది జమాత్ ఉల్ ముమినత్ పేరుతో మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’ అని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొన్నది.
జమ్ముకశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను కూడా యూఎన్వో తన నివేదికలో ప్రస్తావించింది. ఆ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు హతమైనట్లు తెలిపింది. కాగా జైషే, లష్కరే తాయిబా వంటి ఉగ్ర ముఠాలు ఉనికిలో లేవని గత కొంతకాలంగా పాకిస్థాన్ పదేపదే వాదిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో తాజాగా ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నివేదికతో దాయాది పాకిస్థాన్ వక్రబుద్ధి బయటపడింది.
కాగా ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనక జైషే మహ్మద్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి చేసుకున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన ఓ వీడియోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ అంతటా ఆత్మాహుతి దాడులకు ఈ ముఠా కుట్రలు పన్నినట్లు ఆ వీడియోలో ఉంది. దానిపై దర్యాప్తు కొనసాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

