నల్గొండ : జిల్లాలోని మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, పద్మశాలీలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాపోలు యాదగిరి, బీజేపీ వార్డు మెంబర్లు బోయిని యాదయ్య, వాయిల్ల సోమయ్య , చిట్యాల రంగారెడ్డి, ముడిగె నర్సింహ, జిల్లగోని నర్సింహ, అబ్బనగోని నాగరాజు, మోర నర్సింహ, గణేష్ తదితరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అదేవిధంగా కమ్మగూడెంకు చెందిన బీజేపీ నాయకులు రమణ, నరేష్, కోటిరెడ్డి, ఇన్నయ్య పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పేదలకు వరంలా మారాయని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.