మెదక్ : మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి నడిచేందుకు నడుంబిగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పద్మాదేవేందర్ రెడ్డి(MLA Padmadevender Reddy)కి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరుతున్నారు. సోమవారం హవేళి ఘనపూర్ మండల పరిధిలోని నాగపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత మైనంపల్లి అరాచకాలు చూడలేక మేము పార్టీ మారుతున్నట్టు పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పద్మాదేవేందర్రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ నెల30న జరిగే ఎన్నికల్లో పద్మాదేవేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు.