మెదక్ : మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి అన్ని పార్టీల నాయకుల మద్దతు రోజురోజుకు పెరుగుతున్నది. ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి (MLA Padmadevender Reddy) గెలిపిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్ని పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని 21 వార్డు బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ నిర్మల పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కౌన్సిలర్‌తో పాటు 60 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని ఫరీద్ పూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హవేలి ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సౌందర్య, ఉప సర్పంచ్ వెంకటి, ఎంపీటీసీ రాజయ్య, బ్రహ్మం, నాయకులు సిద్దు, బాబు, బ్రహ్మం,బాలయ్య,కృష్ణయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు.