మెదక్ : మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తోపాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలతోపాటు 200 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పద్యాదేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చిన్న శంకరం పేట మండల పరిధిలోని మీర్జాపల్లి ఎంపీటీసీ క్కుబాయి మున్యా నాయక్, ధర్పల్లి ఎంపీటీసీ రాధమ్మ, షేర్ పల్లి ఎంపీటీసీ సంతోష పాటు 200 మంది కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్య తనిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నియోజవర్గం అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట మండల పార్టీ అధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు.