నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 6 : బీఆర్ఎస్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం ఆయా జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు పలు సంఘాల చెందిన వారు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకొన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంద్రారెడ్డి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లోచేరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పట్టుబట్టి ఇతడిని కొండాపూర్ మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈయన సతీమణి అంకుష ప్రస్తుతం అనంతసాగర్ సర్పంచ్‌గా కాగా, ఇంద్రారెడ్డి ఉప సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.
అభివృద్ధిని కాంక్షించిన వారు బీఆర్ఎస్ గూటికి చేరారు. కాగా మునిదేవునిపల్లికి చెందిన కొండాపూర్ మాజీ ఎంపీపీ యాదయ్య 100 మంది తన అనుచరులతో, తొగర్పల్లికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ పార్టీ కొండాపూర్ మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జాకీర్, అనంతసాగర్ మాజీ ఎంపీటీసీ ప్రకాశం, మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ రమణి నరేశ్ తదితరులు మంత్రి హరీశ్‌రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు. కాగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలోని బుగ్గారం మండలం సిరకొండ, మద్దునూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు దాదాపు 80 మంది ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సమక్షంలో నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన వైసీపీ మండల అధ్యక్షుడు చిత్తలూరి ఎల్లయ్యతోపాటు 50 మంది, తిరుమలగిరి మండలం జలాల్‌పురానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఉప సర్పంచ్ సోమయ్య, అర్వపల్లి మండలం కాసర్లపహాడ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మోత్కూరుకు చెందిన రజక సంఘం కార్యదర్శి సర్వయ్య, ఉపాధ్యక్షుడు కూసంపల్లి యాకయ్య బీఆర్ఎస్లో చేరారు. గుర్రంపోడు మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ సమక్షంలో, రామన్నపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో, కోదాడ నియోజకవర్గం యువజన సంఘాల అధ్యక్షుడు మునీర్ ఆధ్వర్యంలో యువకులు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలానికి చెందిన 200 మంది వడ్డెర కులస్థులు కాంగ్రెస్, బీజేపీ నుంచి బుధవారం బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.