వనపర్తి, అక్టోబర్ 11 : పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాసాపురం గ్రామానికి చెందిన బీజేపి నాయకులు మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకం అందని ఇల్లు, అభివృద్ధి చెందని గ్రామమే లేదన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి.. సంక్షేమాన్ని వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కులవృత్తుల బలోపేతానికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.