జగిత్యాల : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కానుగంటి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగు నాగేష్, తదితరుల గురువారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ జెడ్పీటీసీ బి.సుధారాణి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పసుపునూటి అనిల్ పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే రాజారాం గ్రామం మదీన మసీద్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అనర్థాలకు కాంగ్రెస్ పార్టీనే కాణమన్నారు. కాంగ్రెస్ ప్రజలను అరి గోస పెట్టే పార్టీ అయితే, బీజేపీ ప్రజలను మోసం చేసే పార్టీ అని దుయ్యబట్టారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ బత్తిని అరుణ, సౌల్ల భీమయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, సర్పంచ్ లహరి మురళి, వక్ఫ్ బోర్డు సభ్యులు సయ్యద్ ఆసీఫ్, సింగిల్ విండో చైర్మన్ సౌళ్ల నరేష్, పలువురు నేతలు పాల్గొన్నారు.