జగిత్యాల : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం జగదేవ్పేట గ్రామానికి చెందిన పలువురు మహిళలు బుధవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటులేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలన్నారు.
ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్, వెల్గటూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.