సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) విజయం ఖాయం అవడంతో, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరెందుకు క్యూ కడుతున్నారు. దీంతో తమ క్యాడర్‌ను కాపాడుకోవడానికి ఆ పార్టీల అభ్యర్థులు నానా పాట్లు పడుతుంటే బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి సమక్షంలో 28వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిరోజ్ ఖాన్, మసాలా సైదులు నజీర్ చింతలపాటి శీను కప్పల సుమన్ నజీర్‌తో పాటు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
మరోవైపు తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన బైరు మహేష్, రాజపురం నాగార్జున గౌడ్ మహేష్ గౌడ్ మక్తవత్ నాగమణి, రాపర్తి చందు రాపర్తి శ్రవణ్ రాచకొండ శ్రీకాంత్ భైరసాయి గోపగాని సాయి వినయ్, సుమన్‌తో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. 24 వ వార్డులో బత్తుల జానీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మనోహర్, ఉపేందర్, మణి, వెంకన్నతో పాటు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీని వీడారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.