సంగారెడ్డి : సంగారెడ్డి నియోజక వర్గంలో తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని, తాను గత ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అందబాటులో ఉన్న వక్తి చింతా ప్రభాకర్ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
బుధవారం మాజీ (బీజేపీ) ఎంపీపీ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రారెడ్డి, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే చింతా ప్రభాకర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించాలని సూచించారు.
తాను ఎల్లప్పుడు ప్రజల కోసమే ఆలోచించే మనిషని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంగారెడ్డిలోని ప్రతి కార్యకర్త కసిగా పని చేసి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత సంగారెడ్డి నాయకులపై ఉందన్నారు. ఎలాంటి పనులు కావలన్నా చింతా ప్రభాకర్ పట్టు పట్టి ఆ పనులను చేసి ప్రజలకు అందిచిన నాయకుడ చింతా ప్రభాకర్ అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, మాజీ సర్పంచ్‌లు, మండల ప్రధాన కార్యదర్శి గోవర్థన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లాగౌడ్, మోహన్‌గౌడ్, ఎంపీటీసీలు రాందాస్, నాయకులు రఘనాథ్‌రెడ్డి, ప్రభుదాస్,సడాకుల కుమార్, నగేష్, ప్రవీణ్, నాగయ్య, రవి, గురుకిరణ్ పాల్గొన్నారు.