మహబూబాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మండలం, కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, హరిపిరాల, దుబ్బ తండా, మంగళి సాయి తండాకు చెందిన కాంగ్రెస్ నేత జాటోత్ భాస్కర్ 20 మంది, కొడకండ్ల మండలం, రామవరం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, ప్రశాంత్ యాదవ్‌తో పాటు 50 మంది పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి శాయ శక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చెప్పారు. పార్టీ గెలుపుకోసం తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత పోనుగోటి సోమేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.