జూబ్లీహిల్స్, అక్టోబర్ 6 : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకముందే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరికలు మొదలయ్యాయి. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ ఎన్ఆర్ఆర్ పురం సైట్-5లో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఫయాజ్ ఖాన్ ఆధ్వర్యంలో 120 మంది మహిళలు, యువకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో ఆయన పాలన కోరుకుంటున్నారని మాగంటి సునీతా గోపినాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమారుడు మాగంటి వాత్సల్యనాథ్తో కలిసి పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.