నల్లగొండ : జిల్లాలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు.
పార్టీలో చేరిన వారిలో పుట్టల మధు, నెమ్మది రజిని.నాకేరెకంటి. కిరణ్.దైద ధర్మయ్య. (కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ ). పూట్టల ఎల్లమ్మ. పుట్టల సుమంత్. దైద జానయ్య. పుట్టల వేణు, గుడుగుంట్ల విజయ్, పెదమామ్. మహేష్, వడ్డే చంటి. పుట్టల వెంకటమ్మ, మోటం కనకయ్య, పుట్టల మధు, నాగవేళ్లి యాదగిరి మచ్చ సైదులు. తదితరులు ఉన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, జెడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, వేములపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ మాడ్గులపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మోసిన్ అలీ, రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.