హైదరాబాద్, ఆక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 17న చలో రాజ్‌భవన్‌ను నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు.
బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయపరంగా సుప్రీంకోర్టులో పోరాడుతూనే, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 18న బీసీల జేఏసీ నిర్వహించ తలపెట్టిన రాష్ట్రబంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.