Jogu Ramanna | నేడే ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. జోగు రామన్న ముందస్తు అరెస్టు
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఇదే సమయంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ ఎన్నికలలకు పరిశీలకులిగా జోగు రామన్న వ్యవహరిస్తుండగా.. పోలీసులు ఆయన్ను ముందస్తుగా అరెస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్బంధాలకు గురి చేసినా.. తాము ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గర ఉంచుకుని ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని జోగు రామన్న విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో ప్రభావితం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్కు అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరిత చర్యలకు దిగజారిందని అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- jogu ramanna
- Khanapur
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

